![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ నుండి నిన్నటి ఎపిసోడ్‌లో బయటకొచ్చిన శ్రీసత్య.. బిబి కేఫ్ లో ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే అందులో యాంకర్ శివ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
"అర్జున్ కళ్యాణ్ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్. అతనికి నీ మీద ఏం ఉండి ఉంటుంది అని అనుకుంటున్నావ్" అని శివ అడుగగా, " అర్జున్ డీసెంట్.. గుడ్ బాయ్. అతనికి నా మీద ఇష్టం, లవ్ ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నాను " అని చెప్పింది. "అవునా అది నిజం కాదు అసలు అర్జున్ కళ్యాణ్ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్" అని శివ అన్నాడు. దీంతో షాక్ అయ్యింది శ్రీసత్య.
శివ మాట్లాడుతూ, "ఇనయా దృష్టిలో నువ్వు, శ్రీహాన్ చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నావా?" అని అడుగగా.. "అవును అలా చేయకూడదు. బాధ అనిపించింది. ఆ తర్వాత తనకి సారీ కూడా చెప్పా" అని అంది శ్రీసత్య. "నువ్వు బెస్ట్ కెప్టెన్ అని అనుకుంటున్నావా?" అని శివ అడిగేసరికి అవునని చెప్పింది. "మరి ఇనయా ఎందుకు బెస్ట్ కెప్టెన్ అయ్యింది" అని అడుగగా, "ఎవరికి అలా అనిపించిందో అలా చెప్పారు. నా దృష్టిలో నేను గుడ్ కెప్టెన్" అని శ్రీసత్య చెప్పింది. "ఫ్లిప్పింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా సత్య? " అని శివ అడిగేసరికి, "నేనెక్కడ ఫ్లిప్ అయ్యాను" అని అమాయకంగా అడిగింది. "గెలుపుని తీసుకుంటున్నావ్. ఓటమిని తీసుకోవట్లేదు అని రేవంత్ తో అన్నావ్. ఇదే సత్య అన్నం ప్లేట్ ని విసిరేసావ్" అని చెప్పేసరికి, ఆశ్చర్యపోయింది శ్రీసత్య.
![]() |
![]() |